మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి సీతక్క

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: భూపాలపల్లి

మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈ కీలక విషయాలు వెల్లడించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పదిహేను లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అన్నీ మహిళల పేరు మీదే ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో అర్హులందరికీ కొత్త పింఛన్లు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.