నెల్లూరులో ప్రారంభమైన నామినేషన్లు: జడ్పీటీసీలకు 12, ఎంపీటీసీ స్థానాలకు 373 దాఖలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం ఉత్సాహంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఎంపీటీసీ స్థానాలకు 373, జడ్పీ కార్యాలయంలో జడ్పీటీసీ స్థానాలకు 12 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. జడ్పీ సీఈవో మధుసూదన్, ఉప సీఈవో బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పకడ్బంది ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.