పాకిస్థాన్‌లో భరతనాట్యానికి ప్రాణం పోసిన ఇందూ మిథా కన్నుమూత
రిపోర్టర్: అశోక్
స్థలం: World
దేశ విభజన అనంతర కాలంలో సరిహద్దులు దాటి పాకిస్థాన్ వెళ్లి, అక్కడ భరతనాట్య కళను ప్రచారం చేసిన ప్రముఖ నాట్య గురువు ఇందూ మిథా (97) డబ్లిన్‌లో కన్నుమూశారు. ఢిల్లీకి చెందిన బెంగాలీ క్రిస్టియన్ అయిన ఆమె, పాకిస్థాన్ సైనికాధికారి అబూబకర్ ఉస్మాన్ మిథాను వివాహం చేసుకుని కరాచీకి వెళ్లారు. సంప్రదాయాలను ఎదురించి ఆమె సాధించిన నాట్య కళా ప్రస్థానం ఇరు దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచింది.