లైంగిక వేధింపుల కేసులో బ్రిటన్ నటుడు రస్సెల్ బ్రాండ్ విచారణ
రిపోర్టర్: మహేష్
స్థలం: London
తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను ప్రముఖ బ్రిటన్ నటుడు, కమెడియన్ రస్సెల్ బ్రాండ్ ఖండించినట్లు లండన్ కోర్టులో పోలీసులు తెలిపారు. ఎప్పుడూ ఎవరిపైనా బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడలేదని విచారణ సందర్భంగా రస్సెల్ బ్రాండ్ స్పష్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, అవాస్తవాలని ఆయన తేల్చిచెప్పారు. ఆరు మంది మహిళలు చేసిన లైంగిక దాడి ఆరోపణలపై ప్రస్తుతం సౌత్వార్క్ క్రౌన్ కోర్టులో ఆయనపై విచారణ కొనసాగుతోంది.