వైకాపా నేతల ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: నెల్లూరు
వైకాపా నేతలు అనిల్‌కుమార్ యాదవ్, ప్రసన్నకుమార్ రెడ్డి తమపై చేస్తున్న కక్షపూరిత వ్యాఖ్యలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రంగా ఖండించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలతో వైకాపా నేతల బండారాన్ని బయటపెడుతున్నామన్నారు. వీపీఆర్‌కు దందాలు చేయాల్సిన అవసరం లేదని, ప్రసన్నకుమార్ రెడ్డి అక్రమ మైనింగ్‌పై ఇంటెలిజెన్స్ నివేదికలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలే వైకాపా కుట్రలకు బుద్ధి చెబుతారన్నారు.