అవుట్‌స్టాండింగ్ పెర్ఫార్మెన్స్తో వన్‌ప్లస్ 16 మొబైల్ ఆవిష్కరణ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ త్వరలో విడుదల చేయనున్న తన సరికొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ వన్‌ప్లస్ 16కి సంబంధించిన బెంచ్‌మార్క్ స్కోర్లను కంపెనీ తాజాగా అధికారికంగా వెల్లడించింది. ఈ హ్యాండ్సెట్ అంటుటు ప్లాట్‌ఫారమ్‌లో ఏకంగా యాభై ఆరు లక్షలకు పైగా పాయింట్లు సాధించినట్లు సంస్థ తెలిపింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఎలైట్ సిరీస్ చిప్సెట్తో పాటు అత్యాధునిక గేమింగ్ ఫీచర్లు, శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుందని కంపెనీ స్పష్టం చేసింది.