రైతన్నలకు వ్యవసాయ శాఖ హెచ్చరికల రూపంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెరుకుముడి మరియు ముద్దుముడి గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఏవో వెంకట కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్ నీనో ప్రభావం వల్ల వాతావరణ మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున, నవంబర్ నెల ఆఖరి వరకు ఎట్టి పరిస్థితులలోనూ నారుమడులు పోయవద్దని ఆయన రైతులకు స్పష్టం చేశారు. వర్షాలను, భూమిలోని తేమ శాతాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే తగిన వ్యవసాయ పనులను చేపట్టాలని అన్నదాతలకు ఆయన కీలక సూచనలు చేశారు.