దివ్యాంగుల ధ్రువపత్రాల జారీలో ఆధార్ ధ్రువీకరణకు ప్రభుత్వం అనుమతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
గ్రామ, వార్డు స్వర్ణ కార్యాలయాల్లో దివ్యాంగుల వైకల్య నిర్ధారణ మరియు ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో ఆధార్ ధ్రువీకరణను స్వచ్ఛందంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆధార్ ధ్రువీకరణ విఫలమైనప్పటికీ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలు నిరాకరించరాదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ గుర్తింపు విధానాన్ని వినియోగదారులకు తెలపాలని, ఆధార్ వివరాలను సురక్షితంగా ఎన్‌క్రిప్ట్ చేసి భద్రపరచాలని అధికారులను ఆదేశించింది.