తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం జనపనార బ్యాగులు
రిపోర్టర్: హరి
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి భక్తుల కోసం లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రంలో పర్యావరణ హితమైన జనపనార బ్యాగులను అందుబాటులోకి తెచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఎకో ఫ్రెండ్లీ జూట్ సంచులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయం వెనుక ఉన్న కౌంటర్లలో లభించే ఈ బ్యాగుల ధరలు పరిమాణాన్ని బట్టి పది రూపాయల నుండి వంద రూపాయల వరకు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.