నెల్లూరులో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ: మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన కోటంరెడ్డి
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు రూరల్లోని పొదలకూరు రోడ్డు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న వెయ్యి ఐదు వందల మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసినట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తుకు సైకిల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి విద్యార్థులకు సైకిళ్లు అందించిన గౌరవ మంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు.