అమెరికాలో తనిష్క్ జోరు: కాలిఫోర్నియాలో పదకొండో షోరూమ్ ప్రారంభం

రిపోర్టర్: రాము స్థలం: California

అమెరికాలో తన ఆభరణాల వ్యాపార విస్తరణను మరింత వేగవంతం చేసిన ప్రముఖ టాటా గ్రూప్ బ్రాండ్ తనిష్క్, దక్షిణ కాలిఫోర్నియాలోని ఆర్టీసియా నగరంలో పదకొండో షోరూమ్ను ఘనంగా ప్రారంభించినట్లు టైటాన్ కంపెనీ నార్త్ అమెరికా బిజినెస్ హెడ్ అమృత్ పాల్ సింగ్ వెల్లడించారు. పయనీర్ బౌలేవార్డ్లో ఏర్పాటు చేసిన ఈ భారీ షోరూమ్లో సాంప్రదాయ బంగారు ఆభరణాలు, వజ్రాలు, రత్నాల కలెక్షన్లతో పాటు వివాహాలు, ప్రత్యేక పండుగలకు సరిపోయే ఐదు వేలకు పైగా సరికొత్త డిజైన్లను అందుబాటులో ఉంచామని సంస్థ స్పష్టం చేసింది.