ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఏపీలో సీ ప్లేన్ ప్రాజెక్టు నిర్వహణకు కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో వాటర్ డ్రోమ్స్ ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతగా విజయవాడ, విశాఖ, శ్రీశైలంతో పాటు పలు పర్యాటక ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.