'అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల ఎకరాలు దోచుకున్నారు': సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమకారులు సర్వస్వాన్ని కోల్పోతే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం మాత్రం అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్లు, వందల ఎకరాల భూములు సంపాదించిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత కుటుంబాల పేరిట వివిధ జిల్లాల్లో ఉన్న 439.30 ఎకరాల భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా సభలో బయటపెట్టారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై 30 రోజుల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు.