తిరుమల బ్రహ్మోత్సవాల్లో భద్రత కోసం సరికొత్త టెక్నాలజీ!
రిపోర్టర్: సునీల్
స్థలం: తిరుపతి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల భద్రత కోసం తితిదే సరికొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది. భక్తుల రద్దీ నియంత్రణకు జియో నెట్‌వర్క్ స్లైసింగ్, హెడ్ కౌంటింగ్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. గరుడసేవ సమయంలో కమ్యూనికేషన్ అంతరాయం కలగకుండా 30 ప్రత్యేక పరికరాలు సిద్ధం చేశారు. తోపులాటలు జరగకుండా దిశలవారీగా సరికొత్త ఎగ్జిట్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సీవీఎస్వో మురళీకృష్ణ తెలిపారు.