ఓట్ల లెక్కింపును రాత్రిలోగా పూర్తి చేయాలని ఆదేశాలు
రిపోర్టర్: ఆనందరావు @ పాలకొండ
స్థలం: పాలకొండ
ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి రాత్రి ఎనిమిది గంటలలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. గతంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో జరిగిన జాప్యాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.