ప్రజావాణి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపు
రిపోర్టర్: Mulugu News
స్థలం: ములుగు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంతో పాటు ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించి, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.