ప్రజాభవన్లో మెట్రో ఆర్టీసి కామన్ పాస్ ఆవిష్కరణ: డిప్యూటీ సీఎం భట్టి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా మెట్రో మరియు ఆర్టీసీ కామన్ పాస్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సరికొత్త కామన్ పాస్ను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొని ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.