సంగీత రంగంలో సంచలనం: దక్షిణ కొరియాలో చార్ట్ బస్టర్ గా నిలిచిన ఏఐ పాట

రిపోర్టర్: రాజేష్ స్థలం: సియోల్

దక్షిణ కొరియాలో గ్లోరీవేవ్ మ్యూజిక్ ప్రొడక్షన్ టీమ్ రూపొందించిన ఒక ఏఐ పాట మ్యూజిక్ చార్టుల్ లో రెండో స్థానానికి దూసుకెళ్లినట్లు నిపుణులు తెలిపారు. మెమోరు పేరుతో విడుదలైన ఈ పాటకు పూర్తిగా కృత్రిమ మేధ ద్వారానే వాయిస్ అందించినట్లు వారు పేర్కొన్నారు. మనుషులు పాడిన పాటలతో పోటీపడుతూ మ్యూజిక్ లవర్స్ ను ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. సింగర్ తో సంబంధం లేకుండా కేవలం మెలోడీ బాగుంటే చాలునని సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు.