చౌటుప్పల్‌లో భక్తిశ్రద్ధలతో శ్రీచక్ర కుంకుమార్చన
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్‌లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా మహిళా భక్తులచే శ్రీచక్ర కుంకుమార్చన అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్ఛరణలతో కుంకుమార్చన జరిపారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్‌గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు, వివిధ సంఘాల ప్రతినిధులు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.