అజయ్ దేవగన్ రేంజర్ సినిమా విడుదల వాయిదా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mumbai
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన తాజా జంగిల్ అడ్వెంచర్ మూవీ రేంజర్ విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేయాలని ముందుగా భావించినప్పటికీ, ఇప్పుడు 2027 మార్చిలో ఈద్ తర్వాత విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు సంజయ్ దత్, తమన్నా భాటియా కీలక పాత్రల్లో నటిస్తుండగా, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మరియు అటవీ సంరక్షణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.