తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు: ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేసిన టీటీడీ
రిపోర్టర్: నరేష్
స్థలం: తిరుమల
తిరుమలలో అక్టోబర్ 13 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్న నేపథ్యంలో, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.