రైతన్నలకు ఊరట: సరస్వతి కాలువ ద్వారా నేటి నుంచి నీటి విడుదల
రిపోర్టర్: మహేష్
స్థలం: నిర్మల్
సరస్వతి కాలువ ద్వారా మంగళవారం నుంచి నీటిని విడుదల చేసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎల్నినో ప్రభావం వల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినప్పటికీ, వరి పొట్టదశలో ఉండటంతో రైతుల విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నీటిని సద్వినియోగం చేసుకొని చెరువులను నింపుకోవాలని అధికారులు సూచించారు.