శ్రద్ధా వాకర్ హత్య కేసు: విదేశీ అధికారుల సాక్ష్యానికి కోర్టు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
శ్రద్ధా వాకర్ హత్య కేసులో వాట్సాప్, గూగుల్, జీమెయిల్, బంబుల్ సంస్థల నోడల్ అధికారుల సాక్ష్యాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నమోదు చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వారిని రప్పించడం వల్ల అధిక ఖర్చు, తీవ్ర జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ ఒకటి నుంచి వారి వాంగ్మూలాలను రికార్డు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.