తెలంగాణలో పెరగనున్న ఆటో ఛార్జీలు: కనీస ధర రూ.30కి పెంపు
రిపోర్టర్: సునీల్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఆటో మీటర్ ఛార్జీలను ప్రభుత్వం సవరించింది. పెరుగుతున్న ఇంధన, విడిభాగాల ధరల దృష్ట్యా కనీస ఛార్జీని రూ.20 నుంచి రూ.30కి, అదనపు కిలోమీటరుకు రూ.11 నుంచి రూ.14కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. 2014 తర్వాత తొలిసారిగా ఛార్జీల పెంపు జరగడంతో ప్రయాణికులపై భారం పడనుంది.