రాహుల్ గాంధీని కలిసిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీలను నివాసంలో భేటీ అయ్యారు. ఉదయపు అల్పాహార సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా విడుదల చేసింది.