కాంగ్రెస్ నాయకత్వ అక్రమాలకు సుప్రీంకోర్టు తీర్పు చెక్ పెట్టిందన్న కేటీఆర్
రిపోర్టర్: సతీష్
స్థలం: Hyderabad
పిరాయింపుల కేసులో దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్వాగతించారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఎత్తులు తలకిందులయ్యాయని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో న్యాయస్థానాల పాత్ర కీలమని కేటీఆర్ స్పష్టం చేశారు.