కడప జిల్లాలో ఉద్రిక్తత: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

రిపోర్టర్: అశోక్ స్థలం: Kadapa

కడప జిల్లాలోని పార్నపల్లి సమీపంలో పోలింగ్ బూత్ వద్దకు వెళ్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళుతున్న ఎంపీ కాన్వాయ్ను నిలువరించడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా భారీగా బలగాలను మోహరించారు.