ఇందిరమ్మ టవర్ల నిర్మాణం: నాలుగు నగరాల్ లో జీ ప్లస్ ఫైవ్ భవనాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు గృహ వసతి కల్పించే లక్ష్యంతో నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్ నగరాల్ లో జీ ప్లస్ ఫైవ్ అంతస్తులతో ఇందిరమ్మ టవర్లను నిర్మించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తొలి విడతలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నోటిఫికేషన్లను దీపావళిలోపే విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీని ద్వారా అర్హులైన పేదల సొంతింటి కల నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.