అమెరికాలో వైభవంగా శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణం ప్రారంభం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమెరికా
అమెరికాలో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు శ్రీ అష్టలక్ష్మీ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణం ఘనంగా ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు. త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సులతో ఈ నెల నాలుగో తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. మొత్తం ఇరవై తొమ్మిది రోజుల పాటు ఏడు కాండలు, ఇరవై నాలుగు వేల శ్లోకాల పారాయణం ఉంటుందని, భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వీక్షించవచ్చని వెల్లడించారు.