విజయనగరంలో రూ 6.88 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అదితి శంకుస్థాపన

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష్మి గణపతి కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 6.88 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలస్వామి, నాయకులు గంటా రవి, అవనాపు విజయ్ తదితరులు పాల్గొన్నారు.