సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఏపీ డిజివెరిఫై ప్లాట్ఫామ్ తప్పనిసరి

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో అన్ని రకాల సర్టిఫికెట్ల ధృవీకరణకు ఏపీ డిజివెరిఫై డిజిటల్ ప్లాట్ఫామ్ను తప్పనిసరిగా ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కోసం సమర్పించే పత్రాలను ఇకపై కేవలం ఈ డిజిటల్ విధానం ద్వారానే పరిశీలించాలని ఆయన స్పష్టం చేశారు. మాన్యువల్ వెరిఫికేషన్కు స్వస్తి పలకడం ద్వారా నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుట్ట పడుతుందని, సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది.