అంతరిక్షంలో ముగిసిన శకం: భూమిపై కూలిన నాసా స్పేస్ టెలిస్కోప్

రిపోర్టర్: హరి స్థలం: Sumatra

దాదాపు ఇరవై రెండు సంవత్సరాల పాటు కక్ష్యలో విజయవంతంగా సేవలు అందించిన నాసాకు చెందిన నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ భూవాతావరణంలోకి ప్రవేశించి కుప్పకూలినట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇండోనేషియాలోని సుమత్రా ప్రాంతంపై ఈ అంతరిక్ష టెలిస్కోప్ తిరిగి భూమిని చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు. సూర్యుడిలో పెరిగిన సౌర కార్యకలాపాల కారణంగా వాతావరణ ఘర్షణ పెరిగి, కక్ష్య క్రమంగా క్షీణించడంతో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకున్నట్లు అంతరిక్ష పరిశోధకులు తెలిపారు.