ఎపిక్ ట్రైలర్ లాంచ్ వేడుకలో విజయ్ దేవరకొండపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

ఆనంద్ దేవరకొండ నటించిన 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' ట్రైలర్ లాంచ్ వేడుకలో రష్మిక మందన్న సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రేమకు నిర్వచనం చెబుతూ ఆమె విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసిన సైగలు అభిమానులను అలరించాయి. ఆనంద్ కష్టాన్ని, సినిమాపై ఆయనకున్న అంకితభావాన్ని రష్మిక ప్రశంసించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.