మచిలీపట్నంలో ఘనంగా కొల్లు రవీంద్ర ప్రజా పాదయాత్ర: సమస్యల పరిష్కారమే లక్ష్యం
రిపోర్టర్: మహేష్
స్థలం: కృష్ణా
మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ప్రజా పాదయాత్ర పన్నెండో రోజు ఇరవై నాలుగు, ఇరవై ఐదు, ఇరవై ఎనిమిదో డివిజన్లలో ఉత్సాహంగా సాగిందని గనుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటూ, వాటిని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.