నెల్లూరులో రూ.115 కోట్లతో ఆరు లేన్ల అండర్పాస్ నిర్మాణానికి శంకుస్థాపన

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం జంక్షన్లో ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో రూ.115.27 కోట్ల భారీ వ్యయంతో ఆరు లేన్ల అండర్పాస్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసినట్లు పొంగూరు నారాయణ తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సహకారంతో అవసరమైన అనుమతులు మరియు భూసేకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని, సర్వీస్ రోడ్లతో సహా ఈ ప్రాజెక్టును కేవలం పదిహేదు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.