ఖానాపూర్: వికసిత్ గ్రామ ప్రణాళికపై ప్రత్యేక గ్రామసభ నిర్వహణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖానాపూర్

మండలంలోని ఇరవై ఒక్క గ్రామ పంచాయతీల్లో వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక గ్రామసభలు నిర్వహించారు. ఖానాపూర్ లో ఎంపీడీవో పాల్గొని పథకం పనులు, కూలీల వేతన చెల్లింపులు, జలసిరి పనులు, కొత్తగా చేర్చిన పనులపై వివరించారు. ప్రతి ఇంటా మ్యాజిక్ సోక్పిట్ నిర్మించుకోవాలని సూచించారు. పదిహేను రోజులకు మించి పని కల్పించకుంటే నిరుద్యోగ భృతికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.