11న ఆమనగల్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 11న ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ జైరాం తెలిపారు. జిల్లా పరిషత్ సీఈఓ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు, అన్ని శాఖల అధికారులు హాజరుకానున్నారు. మండల అభివృద్ధిపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.