అహ్మదాబాద్లో భారీ దొంగతనం: కోటి విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అపహరణ

రిపోర్టర్: వెంకట్ స్థలం: అహ్మదాబాద్

అహ్మదాబాద్ సమీపంలోని చాంగోడర్ ప్రాంతంలో గల ఓ వేర్హౌస్లో కోటి రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు చోరీకి గురయ్యాయని చాంగోడర్ పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 21వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కేవలం గంట వ్యవధిలోనే ఈ భారీ దొంగతనం జరిగినట్లు సీసీటీవీ ద్వారా గుర్తించారు. దుండగులు గోడకు ఉన్న మెటల్ షీట్ను కట్ చేసి లోపలికి ప్రవేశించి, ఐఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు ఎత్తుకెళ్లినట్లు మేనేజర్ సుధీర్ అయ్యప్పన్ ఫిర్యాదులో పేర్కొన్నారు.