రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన విజయ్ కుమార్ చారి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పామూరు
రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ విశ్వబ్రాహ్మణస్టేట్ యూత్ లీడర్ పెరమన విజయ్ కుమార్ చారి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరారు. దుర్గాదేవి అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.