నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారానికి పోటెత్తిన అశేష జనవాహిని
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సోమవారం రాత్రి భారీ జనసమూహంతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, చింతకాయల సన్యాసి పాత్రుడు ఈ ప్రచారంలో పాల్గొనగా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ హామీల వైఫల్యం తమ గెలుపుకు దోహదపడుతుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు.