విజయనగరం జిల్లాలో కరవు కలకలం: పది మండలాలు తీవ్ర కరవు ప్రాంతాలుగా ప్రకటన

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవడంతో విజయనగరం జిల్లాలో పంటల సాగు తీవ్రంగా దెబ్బతిన్నదని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలో పదింటిని తీవ్ర కరవు మండలాలుగా ప్రకటించిందని వారు పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు కొత్త రుణాలు అందించడంతో పాటు ఇప్పటికే ఉన్న రుణాల చెల్లింపునకు గడువు పొడిగించే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.