రాష్ట్రంలో ఎల్ నినో కాదు ఎల్లో నినో ఎఫెక్ట్ అంటూ జగన్ ఫైర్
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh
రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్ నినో ఎఫెక్ట్ కాదని ఎల్లో నినో ఎఫెక్ట్ నడుస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని ఇవ్వాల్సిన సమయంలో తాత్సారం చేసి, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదిలేశారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసు పెట్టి పనిచేస్తున్నారనే నమ్మకం ఎక్కడా కనిపించడం లేదని ఘాటు విమర్శలు చేశారు.