ఉక్రెయిన్లోని ప్రముఖ ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్పై రష్యా దాడులు

రిపోర్టర్: నరేష్ స్థలం: Kryvyi Rih

క్రెయిన్లోని క్రివి రిహ్లో ఉన్న ప్రముఖ ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కర్మాగారంపై రష్యా జరిపిన భీకర దాడులు తీవ్ర కలకలం రేపాయి. ఇంధన మౌలిక వసతులు, బ్లాస్ట్ ఫర్నేస్ కేంద్రాలు ధ్వంసమవడంతో ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సైనిక ఉత్పత్తికి మద్దతుగా ఉన్న మెటలర్జికల్ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు మాస్కో స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ఉక్రెయిన్ పారిశ్రామిక రంగానికి భారీగా నష్టం వాటిల్లింది.