మధ్యప్రదేశ్ జిల్లాలో రాజధానుల పేర్లతో వెలసిన విభిన్న గ్రామాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ಅశోక్‌నగర్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అశోక్నగర్ జిల్లా ముంగావళి తాలుకాలో న్యూదిల్లీ, భోపాల్, చండీగఢ్ వంటి ప్రసిద్ధ రాజధానుల పేర్లున్న గ్రామాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానిక కథలు మరియు పూర్వీకుల వలసల కారణంగానే ఈ ఊర్లకు ఆ పేర్లు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే ఈ గ్రామాల పేర్లు దేశ రాజధాని, రాష్ట్రాల రాజధానుల పేర్లను పోలి ఉండటంతో ఉత్తరాలు తప్పుదారి పడుతున్నాయని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.