కూటమి నాయకులకు కృతజ్ఞతలు: మోదీ సంఘీభావ ర్యాలీ విజయంపై వాసిరెడ్డి ప్రకటన

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో బుధవారం మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రజాసేవలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీని విజయవంతం చేసిన కూటమి నాయకులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.