ఉద్యమకారులను ఆదుకోవాలి టీఆర్ఎస్ అధినేత్రి కవిత డిమాండ్

రిపోర్టర్: chandrareddy damidi స్థలం: సికింద్రాబాద్

రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో సంఘాలు నిధుల కొరకు ఎదురు చూస్తున్నాయని వారికి నిధుల కేటాయింపు జరుపాలని ఆదివారం రోజున హైదరాబాద్ లోని టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు రీయింబర్స్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నారని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని, రాష్ట్ర ఏర్పాటు కొరకు పోరాడిన వారికి పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.