సమగ్ర భూ సర్వేతో వివాదాలకు శాశ్వత పరిష్కారమన్న ఎమ్మెల్యే

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వైరా

సమగ్ర భూ సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. కొణిజర్ల మండలం లింగగూడెం, వేతంకుంట గ్రామాల్లో జరుగుతున్న భూ సర్వేను సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా రికార్డులు రూపొందిస్తున్నామని, హద్దులు పక్కాగా నిర్ణయించడం వల్ల వివాదాలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.