స్మశాన వాటికకు దారి లేక అవస్థలు: పారాపురంలో ప్రజల ఆవేదన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కొత్తూరు

కొత్తూరు మండలంలోని పారాపురం పంచాయతీలో దళితవాడ స్మశాన వాటికకు సరైన రహదారి లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాలుగా అధికారులకు విన్నవించినా ఎటువంటి స్పందన లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక వ్యక్తి మరణించగా, దహన సంస్కారాలకు మృతదేహాన్ని తీసుకెళ్లడం నరకప్రాయంగా మారిందని తెలిపారు. వెంటనే రోడ్డు నిర్మించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.