భూముల రీ సర్వే పక్కాగా చేపట్టాలని కలెక్టర్ హుకుం

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్ లో సర్వేయర్లకు జిఎన్ఎస్ఎస్ రోవర్లను పంపిణీ చేసిన ఆయన, సర్వేపై రైతులకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. ఈ రీ సర్వే ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు ఆస్కారం ఉండదని, పారదర్శకమైన రికార్డులు అందుబాటులోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాములు పాల్గొన్నారు.