పేదల ఇంట్లో కల్యాణ లక్ష్మి సిరి వెలుగులు నింపింది
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లోడే రఘు గౌడ్ అందజేశారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని వారు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలకవర్గం మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.